కనులు కలువలాయే .. నా కనులు కలువ లాయే ..
కలల కొలను లోనా విరిసే కనులు కలువలాయే ..
మనసు ముత్య మాయె .. నా మనసు ముత్యమాయే ..
కురిసే స్వాతి చినుకు తాకి నా మనసు ముత్యమాయె ..
ఆశలు .. నా ఊహలు .. విహరించనీ అంబరాలు ..
శ్వాసలు .. నా ఊసులు .. జరిపించనీ సంబరాలు ..
వీచే గాలితో సాగిపోనీ .... ఎల్లలెరుగని మదినీ ... -కనులు
హిమములా పూల సొగసుని ముద్దాడనీ .. తనివి తీరా ..
తరంగమై సెలయేటినే పలకరించనీ ... మనసు తీరా ..
ఊపిరే సంగీతమై .. నినదించనీ వేణుగానమా ..
అల్లరి గారాలని .. చూపించనీ ప్రేమ మధురిమా ..
కొత్తగా ఉండదా .. ఈ లోకమే నిండుగా ... నవ్వగా .. నవ్వగా .. -- కనులు
రుతువులన్ని ముస్తాబయి వచ్చాయిలే .. ఒక్కసారిగా ..
నాల్గు కాలాలు వింతగా స్నేహ హస్త మందిన్చగా ..
ఆకాశమే తారల సాక్షి గా .. ఈ భూమి తో జోడీ కట్టగా
ఆనందమే దిక్కుల సాక్షిగా .. నలువైపులా వ్యాపించగా ..
బ్రతకడం పండుగా .. ప్రతిక్షణం అండగా .. నవ్వుండగా .. నవ్వు తుండగా .. -కనులు
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a comment