నీ పేరే అయినాయి శిలా క్షరాలై ..
కనుపాప పై వాలిన నిదుర ను సైతం ..
రానీయనంత పంత మేమిటో ...
గమ్యమెరుగని అడుగుల పయనం ..
నీతో సాగితే దూరమెంతున్నా లేదు భయం ..
పెనుభారం అవుతున్న హృదయం ...
నీ ఒడి చేరితే దూది పింజ లా మారటం చిత్రం ..
అందమైన పూదోట లా ఈ యవ్వనం ..
ఒక్కసారే వచ్ఛే వసంతమై ప్రణయం ..
పగలు రాత్రి తేడాలు చూపదు నీ సాన్నిహిత్యం ..
నువు కానరాని నిమిషం పగ తీర్చుకుంటుంది కాలం ..
నా హృదయ లోతుల్ని దాటే నీ దరహాసం ..
విరహ వేళల్లో చేస్తుందెందుకు పరిహాసం ..
నీకోసం నా ఈ నిరీక్షణ .. క్షణమొక యుగం ..
నీ చుట్టూ నా మది ప్రదక్షిణ .. యుగ యుగాలకి నిజం
చెలిమి నీడలో విరిసిన పుష్పమా ..
చెలియ జాడనే తెలపవే స్నేహమా ..
తనకోసం నా మది కలవరిస్తోందని . ...
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
Nice really
Very nice
Post a comment